నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టిన రాష్ట్ర అధికార ప్రతినిధి విశబ్ కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అనంతరం రిజర్వేషన్లను పెంచి పదవుల్ని ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అనంతరం వైయస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నీరుగార్చిన ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు, ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరు ఏకతాటిపై ఉంటూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి బండారు శ్రావణి శ్రీ గారి ని ఏమ్మెల్యే గా గెలిపించుకొని నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Mar 26 2024, 07:54